ప్రపంచమంతటా పట్టణీకరణ వేగవంతముగా జరుగుతున్నది. ఈ పట్టణీకరణ మన చుట్టూ జేరుగుతున్న మార్పులలో ముఖ్యమైనది. అభివృద్ది చెందుతున్న దేశాలన్ని చూస్తున్న మార్పు. ఈ క్లిష్టమైన మార్పు నాయకులకు, పరిపాలకులకు ఎన్నో సవాళ్లను ముందుంచుతోంది.
పూర్వం గ్రామాలు కేంద్రంగా జరుగుతున్న మన రోజువారీ కార్యక్రమాలు, సాంఘిక మరియు ఆర్థిక కార్యక్రమాలు, అభివృద్ధి, నేడు పట్టణాలు కేంద్రాలుగు నడుస్తున్నాయి. మునుపు గ్రామాల పై అధారపడిన మన జీవితాలు నేడు పట్టణాల ఆదారంగా నడుస్తూవుంది. ఇది వినటానికి కొంత కష్టంగా వున్నా, మనమంతా అంగీకరించవలసిన పరిస్థితి ఉంది. ఒక రైతు తన పంటకు కొంత గిట్టుబాటు దర కావాలంటే, పట్టణం పైన ఆధార పడాలి. ఒక గ్రామీణ / పట్టణ పౌరుడు తన ఇంటికి కావలసిన నాణ్యమైన వస్తువు ఒక మోస్తరు దరలో కొనాలంటే దగ్గరలోని పట్టణ కేంద్రానికి పోవలసి వస్తోంది.
మన ప్రాంతనికి సమర్థవంతమైన అభివృద్ధి ప్రణాళికలు, ఆ ప్రణాళికల సమర్థవంతమైన అమలుకు మన ప్రాంతం యొక్క సాంఘిక, ఆర్థిక బలం మరియు ఇతర విషయాల పై మనకు అవగాహన వుండాలి, అలాగే గృహ, పారిశుధ్యం, ప్రజా భధ్రత, వగైరా లాంటి విషయాలను విస్మరించలేము.
ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని అర్థవంతమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మన ప్రాంత అభివృది సాదించుటకు అనుగుణంగా ఈ స్మార్ట్ పట్టణం వెబ్ పోర్టల్ / యాప్ రూపొందించబడింది. రవాణా, ప్రజా భద్రత, అత్యవసర సేవలు, పర్యావరణం, ఆర్థికాభివృద్ధి, మొదలైన రంగాల గురించి మరియు పరిపాలన పరమైన సమాచారం అన్నీ ఒకే వేదిక పై అందుబాటులోకి తెస్తుంది ఈ స్మార్ట్ పట్టణం వెబ్ పోర్టల్ / యాప్ వ్యవస్త (a single integrated platform).
ఈ వేదిక, పౌరులకు తమ ప్రాంతంలోని సమస్యలను వ్యక్త పరచటానికి, నాయకులకు/అదికారులకు సమాజంలోని సమస్యలను తెలుసుకొని పరిష్కరించుటానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడుతోంది
ముఖ్య అతిధి:
డా. అశ్విన్ మహేష్, Ex-NASA శాస్త్రవేత్త, అశోక ఫెలో అవార్డ్ గ్రహీత, యూకే వైర్డ్ పత్రిక “ద స్మార్ట్ లిస్ట్ 2012: తమ ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చ గల 50 మేధావుల” జాభితలో ఒకరిగా గుర్తించింది. భారత దేశంలోనే మొదటి కంపుటరైస్ చేయబడిన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ (బెంగళూరు కోసం) రూప కర్త.